ఏ ఎమ్మెల్యే అయిన ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ప్రజల కాళ్లూ, వేళ్లూ పట్టుకునే వారిని చూశాం..లేదా రౌడియిజంతో వీపరీతంగా డబ్బు పంచి ఎమ్మెల్యేగా గెలిచేవాళ్లని చూశాం..అలా గెలిచక వారి పాలన అత్యంత దారుణంగా ఉంటుదని మనందరికి తెలుసు.. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం భిన్నం. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాడు. కలసిమెలసి తిరుగుతాడు. చివరికి చావులోనూ ఆపన్నహస్తం అందిస్తాడు. తాజాగా దిక్కులేని ఓ అనాథ శవాన్ని మోసి రీయల్ హీరో అయ్యాడు. ఆయన ఎవరో తెలుసా.. అస్సాంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి. శుక్రవారం దిలీప్ డే అనే ఒక నిరుపేద వ్యక్తి మరణించాడు. అతనికి ఎవరూ లేరు. కనీసం అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు ఇబ్బంది పడ్డారు. చివరికి శవాన్ని మోసుకెళ్ళటానికి సరిపడా జనం కూడా రాలేదు. ఈ విషయం ఎమ్మెల్యే కుర్మికి తెలిసింది. పేదోడి అంత్యక్రియలకు తాను సాయం చేస్తానని ముందుకొచ్చాడు. పాడెను మోశాడు. కార్యక్రమం మొత్తం దగ్గరే ఉండి అన్ని తానై చూసుకున్నాడు..నిజమైన మంచి మనిషి అని నిరుపించుకున్నాడు.
అయితే ఇంతకముందు ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి ఓ ఆటోడ్రైవర్ తల్లి చనిపోతే.. ఆమె అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. ప్రజల్లో మనసున్న ప్రజానాయకుడిగా పేరు సంపాదించుకున్న కుర్మి ఎమ్మెల్యేగా మూడుసార్లు నెగ్గడం విశేషం. సామాజిక సేవలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఏడాది కాజిరంగా పార్క్‌లో వరదలు వచ్చినప్పుడు.. ఆయనే స్వయంగా 50 కేజీల బియ్యం బ్యాగ్‌ను రిలీఫ్ క్యాంపు వరకు మోసుకెళ్లారు. కుర్మి తల్లి కూడా గతంలో ఇదే నియోజక వర్గం నుంచి ప్రాతినిత్యం వహించారు.