ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలు వారి వారి కుటుంబాలతో ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా.. ఆ సమయాన్ని తమ కుటుంబ సభ్యుల కోసమే కేటాయిస్తున్నారు. అటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు ముందుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే, ఇటీవల అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. అయితే, తన ముద్దుల కూతురు అర్హ విద్యా సంవత్సరం వేడుకలలో భాగంగా.. జరిగిన వేడుకలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అర్హ విద్యాసంవత్సరం వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఫీలవుతున్నా.. ఆ వేడుకల్లో అర్హ చాలా ముద్దుగా కనిపించింది అంటూ తీసిన ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పెట్టాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ పెట్టిన ఈ పోస్టును ఆయన అభిమానులు విపరీత లైక్‌లు కొడుతూ.. షేర్లు కూడా చేస్తున్నారు.