ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కోనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను ఆయనతో చెప్పకుంటున్నారు. అయితే గత 176 రోజులుగా అలుపెరగని పోరటంతో ..నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నవైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురైనాడు. వైద్యులు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చినా ఆయన గురువారం ఒక్కరోజే విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం వైఎస్ జగన్ పాదయాత్రను నరసాపురం మండలం చిట్టవరం నుంచి ఉదయం 7.30 గంటలకు ప్రారంభింరు.
టీడీపీ నేత అరెస్ట్.. ఏం చెశాడో తెలుసా..!
అక్కడి నుంచి పాదయాత్ర రాజోలు క్రాస్‌రోడ్డు, దిగమర్రు, పెదగరువు క్రాస్‌రోడ్డు వరకు ప్రజలతో మమేకం అవుతూ కొనసాగుతుంది. అనంతరం వైఎస్ జగన్ మధ్యాహ్న విరామానికి వెళతారు. అక్కడి నుంచి బయలుదేరి పాలకొల్లులో జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసగించిన అనంతరం వైఎస్ జగన్ ఉల్లంపర్రు వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. అక్కడ రాత్రి బస చేస్తారు.