ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ కేంద్రంగా ఆ పార్టీ మహానాడు కార్యక్రమం మూడు రోజులపాటు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అంతేకాకుండా, నాడు రాష్ట్ర విభజన సమయం నుంచి మొన్నటి వరకు ప్రత్యేక హోదా ఊసెత్తని చంద్రబాబు.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటాలతో మేల్కొని.. మళ్లీ ప్రత్యేక హోదా అంటూ రాగాన్ని అందుకున్నారు. ఆ నేపథ్యంలోనూ నిర్వహించే సభలకు ప్రభుత్వ ధనాన్నే ఖర్చు చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి మహిళల్లో భద్రతా విషయమై అభద్రతా భావం నెలకొన్న విషయం తెలిసిందే. గడిచిన నాలుగు సంవత్సరాల్లో మహిళలపై వేల సంఖ్యలో దాడులు జరగడమే అందుకు ప్రధాన కారణం. అందులోనూ.. మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిలో టీడీపీ కార్యకర్తల నుంచి.. నేతల వరకు వారి వారి పేర్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ హయాంలో మహిళలపై ఏ రీతిన దాడులు జరుగుతున్నాయన్న అంశానికి ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమమే ఉదాహరణ.
మహానాడులో చంద్రబాబుతో ఫోటో దిగుదామని వచ్చిన మహిళలను సైతం.. చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ వారిని పక్కకు లాగారు. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలిసినా మిన్నకుండిపోవడం గమనార్హం. చంద్రబాబు సెక్యూరిటీ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి ఆ మహిళలది. స్వయాన చంద్రబాబు సమక్షంలో… సెక్యూరిటీ సిబ్బంది అలా ప్రవర్తిస్తున్నా ఏమీ అనకపోవడం విడ్డూరమంటూ టీడీపీ నేతలే చర్చించుకున్నారు.