దేశ రాజధాని డిల్లీ మహానగరంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈరోజు నుంచి జూన్ 3 వరకు ఈ సంబరాలు జరగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్ ఆవరణలో హైదరాబాద్ లాడ్ బజార్ ను ప్రత్యేక ప్రతినిధులు వేణు గోపాల చారి, రామచంద్రు తెజావత్, భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ లు ప్రారంభించారు. హైదరాబాద్ వాతావరణాన్ని తలపించేలా లాడ్ బజారు ను అధికారులు ఏర్పాటు చేశారు.
హైదరాబాదీ బిర్యాణి, కరాచి బేకరి స్పెషల్స్, తెలంగాణ హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాళ్లు, తెలంగాణ కళలు, వంటకాలు, చేనేత ప్రత్యేక ఆకర్షణ గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా లాడ్ బజార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమంలో తెలంగాణ నిండుదనం కనిపించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఈరోజు ఉదయం తెలంగాణ భవన్ నుండి ఇండియా గేట్ వరకు 3కే రన్ తో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను దేశ రాజధాని వేదికగా చానున్నామని ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు తెలిపారు.