మన దగ్గర టాలెంట్ ఉంటె ఏ పనిలోనైన విజయం సాధించవచ్చు.రోజు రోజుకి సమాజం మారుతున్న ఈ రోజుల్లో తెలుగు సినిమాలు ఏ విధంగా వస్తున్నాయో మనందరికీ తెలిసిందే.తెలుగులో కొంతమంది మహిళలు మాత్రమే దర్శకులుగా పరిచయమావుతూ..తమ అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు.
అయితే తాజాగా వారి జాబితాల్లోకి సంజనా రెడ్డి చేరిపోయారు.ఈ రోజు యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా ఆమె రూపొందించిన రాజుగాడు సినిమా విడుదల అయింది.ఈ సందర్భంగా సంజనా రెడ్డి సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడటానికి గల కారణాన్ని వివరిస్తూ తన అనుభవాలను తెలిపారు.”ఒకసారి వేసవి సెలవుల్లో విశాఖలోని మా బంధువుల ఇంటికి వెళ్లాను. ఆ సమయంలోనే పవన్ కల్యాణ్ ‘ఖుషీ’ విడుదలైంది. నెల రోజుల పాటు విశాఖలో వున్న నేను ఆ సినిమాను 27 సార్లు చూశాను.
‘ఖుషీ’ సినిమాలోని ప్రతీ సీన్ .. పవన్ కల్యాణ్ నటన నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. సినిమాలంటే అమితమైన ఆసక్తికి ఈ సినిమానే పునాది వేసింది. ఆ తరువాత నేను జర్నలిస్ట్ ను కావడంతో సినిమా ప్రపంచంతో మంచి పరిచయం ఏర్పడింది. వర్మ ‘రౌడీ’ సినిమాకి అసిస్టెంట్ గా పనిచేయడం .. అమల అక్కినేనితో చేసిన యాడ్ ఫిల్మ్ కి మంచి పేరు రావడంతో దర్శకత్వం వైపు అడుగులువేశాను” అని సంజనా రెడ్డి మీడియాకు చెప్పుకొచ్చారు.