Home / MOVIES / రాజుగాడు హిట్టా ..ఫట్టా -దరువు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ ..!

రాజుగాడు హిట్టా ..ఫట్టా -దరువు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ ..!

సినిమా పేరు: రాజుగాడు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజనా రెడ్డి

కథ సహాకారం : ఏకే ఎంటర్ ట్రైన్మెంట్

నటీనటులు: రాజ్‌తరుణ్‌, అమైరా దస్తూర్‌, రాజేంద్రప్రసాద్‌, నాగినీడు, ప్రవీణ్‌, సితార తదితరులు

ఛాయాగ్రహణం :రాజశేఖర్

సాహిత్యం:రామజోగయ్య శాస్త్రి /భాస్కర భట్ల

ఎడిటర్ :ఎంఆర్ వర్మ

సంగీత దర్శకుడు: గోపీ సుందర్‌

నిర్మాత: అనిల్‌ సుంకర

సంస్థ : ఏకే ఎంటర్ ట్రైన్మెంట్

విడుదల తేదీ: 01-06-2018

రేటింగ్‌: 3.25\5

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ..సంజనారెడ్డి తొలిసారిగా దర్శకత్వం వహించగా అనిల్ సుంకర నిర్మాణ సారథ్యంలో తెరకెక్కి ఈ రోజు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ “రాజు గాడు “.మరి రాజుగాడు హిట్ అయిందా ..ఫ్లాఫ్ అయిందా ..ఆన్లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ ఎక్స్ క్లూజీవ్ రివ్యూ మీకోసం
..మీరు ఒక లుక్ వేయండి ..

అసలు క‌థ‌ ఏమిటి అంటే ..!

మూవీ కాన్సెప్ట్ క్లిక్క‌యితే.. దాన్ని స‌రిగా వాడుకునే తెలివితేట‌లుంటే.. ఏంతైనా మ్యాజిక్ చేయొచ్చు. ఓ భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడులా అని నిరూపించిన మరో మూవీ రాజుగాడు .అసలు ఈ మూవీ కథ ఏమిటి అంటే రాజు (రాజ్‌త‌రుణ్‌)కి చిన్న‌ప్ప‌టి నుంచి త‌నకి తెలియ‌కుండానే త‌న చేయి దొంగ‌త‌నాలు చేయించే క్లెప్టో్మియా అనే విచిత్ర‌మైన జ‌బ్బు ఉంటుంది.అయితే అది వయస్సుతో పాటుగా పెరిగి పెద్దదవుతుంది .ఈ క్రమంలో తను ప్రేమించే రాజు ఒక దొంగ అని తెలిసి ప్రేయసి దూరం అవుతుంది. ఈ క్రమంలో జీవితంలో ఎవర్ని ప్రేమించ‌కూడ‌దు అనుకుంటున్న సమయంలో త‌న్వి (అమైరా ద‌స్తూర్‌)ని చూసి ఫస్ట్ లుక్ లోనే ప్రేమ‌లో ప‌డిపోతాడు.

త‌న జ‌బ్బు గురించి చెబితే ఆ అమ్మాయి ఎక్క‌డ దూరం అవుతుందో అని… ఆ విష‌యాన్ని దాచేస్తాడు. త‌న్వి ఇంట్లో వాళ్లు కూడా రాజు – త‌న్విల పెళ్లికి ఒప్పుకుంటారు. కాక‌పోతే ఒక్క‌టే ష‌ర‌తు. రామాపురంలో ఉంటున్న తాత‌య్య (నాగినీడు) కి కూడా న‌చ్చాలంటారు. అందుకోసం రామాపురం వెళ్తాడు రాజు. అయితే.. త‌న్వి తాత‌య్య‌కు దొంగ‌ల‌న్నా, దొంగ‌త‌నాల‌న్నా అస‌హ్యం. ఆ ఊర్లో ఎవ‌రు దొంగ‌త‌నం చేసినా వాళ్ల చేతుల్ని న‌రికేస్తుంటాడు. అలాంటి ఇంట్లో చేయితిరిగిన దొంగ‌.. రాజు అడుగుపెడ‌తాడు. అప్పుడేమైంది? త‌న జ‌బ్బుని కప్పి పుచ్చుకోవ‌డానికి రాజు ఆడిన నాట‌కాలేంటి? తాత‌య్య‌నీ, ఇంట్లోవాళ్ల‌నీ ఒప్పించి తన్విని పెళ్లి చేసుకున్నాడా, లేదా? అనేదే ఈ చిత్రం యొక్క క‌థ‌..

విశ్లేష‌ణ‌:

ఒక కాన్సెప్ట్ ప్ర‌కారం న‌డిచే క‌థ ఇది. ఈ మూవీకి కాన్సెప్టే బ‌లం. గతంలో వచ్చిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు మాదిరిగా ఈ మూవీను దర్శకురాలు క్లెప్టోమేనియా పాయింట్‌ని కూడా స‌రిగా డీల్ చేసి ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పండించారు . దర్శకురాలు ఎంచుకున్న ఈ మూవీ క‌థ‌కి కాన్సెప్ట్ తోపాటుగా వినోదం, బ‌ల‌మైన ఎమోష‌న్,
విచిత్ర‌మైన పాత్ర‌లు సరిపోయాయి . అవి అందించ‌డంలో సంజ‌న సఫ‌ల‌మైంది. కానీ ఆ రెండింటినీ చాలా పేల‌వంగా తీర్చిదిద్దారు.

వంద కోట్ల విలువైన బాంబుని చూస్తే… బీసీ కాలం నాటి సినిమాలు, అప్పుడు అమ‌ర్చిన టైం బాంబులు గుర్తొస్తాయి. ఆ స‌న్నివేశాల్ని లాజిక్‌కి ఎంత దూరంగా చూపించారో న‌వ్వొస్తుంది. హైద‌రాబాద్‌ని అత‌లాకుత‌లం చేసే బాంబుని టెర్ర‌రిస్టు జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. అ నాగినీడు ఇంట్లో పాత్ర‌లు, వాటి చుట్టే పండే వినోదంతో రాజుగాడు అదరగొట్టాడు . ద్వితీయార్థంలో వచ్చే షాపింగ్ మాల్ ఎపిసోడ్ అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్ పాత్ర‌ల డూప్‌ల‌ను రంగంలోకి వచ్చి వాళ్ళు చేసే కామెడీ ఈ సినిమాపై ఉత్సకతను పెంపొందించింది ప‌తాక స‌న్నివేశాల్ని, అంత‌కు ముందు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్‌ బాగుంది .

న‌టీన‌టులు:

రాజ్ త‌రుణ్ మంచి న‌టుడే. కానీ ఈమ‌ధ్య మ‌రీ పేల‌వ‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటున్నాడు. మ‌రోసారి త‌న జ‌డ్జిమెంట్ తప్పకుండ ఒక మంచి కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు . న‌ట‌న‌లో ఈసారి మెరుపులు చూపించాడు . ఇది వ‌ర‌క‌టితో పోలిస్తే… అత‌ని హుషారు పెరిగింది . రాజేంద్ర ప్ర‌సాద్ లాంటి సీనియర్ న‌టుడు మూవీలో ఉండటం బలం .అమైరా ద‌స్తూర్‌ తన పాత్రకు న్యాయం చేసింది .రావు ర‌మేష్ ఎప్ప‌ట్లా.. త‌న వ‌ర‌కూ న్యాయం చేసుకున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా తమ పాత్రలకు ఆయా పరిధిలో న్యాయం చేశారు .

సాంకేతిక వ‌ర్గం:

కొన్ని కాన్సెప్టుల వ‌ర‌కే బాగుంటాయి. అలాంటివి తెర‌పైకి తీసుకురావ‌డం ..వాటిని అందరి చేత శభాష్ అనిపించుకునేలా నిరూపించిన సినిమా ఇది. చిన్న కాన్సెప్ట్‌కి బలం ఈ మూవీలోని స‌న్నివేశాలు, సంఘ‌ట‌న‌లూ . పాట‌లు ఓకే అనిపిస్తాయి. ఒక్క చిన్న కాన్సెప్ట్ తో ఈ మూవీని హిలేరియ‌స్‌గా తీర్చి దిద్డటంతో సఫలమయ్యారు సంజనా.

బలం :
*హీరో పాత్ర తెరకెక్కిన విధానం
*హీరో రాజ్ తరుణ్ నటన
*దర్శకురాలు సంజనారెడ్డి తెరకెక్కించిన విధానం
*సంగీతం
*మాటలు ,ఎమోషనల్ సీన్స్

బలహీనతలు:
*బాంబు సన్నివేశం కొంచెం లాంగ్ అవ్వడం
* సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓవర్ యాక్షన్

దరువు ట్యాగ్ లైన్ :  భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడులను మించి మరో సరికొత్త మూవీ రాజు గాడు ..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat