కర్నూలు రాజకీయం… టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి చంద్రబాబు ఫోన్..! పెళ్లి పనుల్లో ఉన్న మంత్రి అఖిల ప్రియకు భారీ షాక్..!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితిపై ఆరా తీసే పనిలో పడ్డారు. విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడు కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితిపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తల పనితీరుపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు ఫోన్ చేశారని, పెళ్లి పనుల్లో ఉన్న మంత్రి అఖిల ప్రియకు అది చేదు వార్తేనంటూ ఓ సోసల్ మీడియా కథనం పేర్కొంది.
వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ సభ
ఇక అసలు విషయానికొస్తే.. అయితే, రాజకీయాల్లో నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారన్న విషయం ప్రతీ ఒక్కరికి విధితమే. అందులో కర్నూలు రాకీయం అయితే మరీను. ఇటీవల కాలంలో మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఇటువంటి వాతావరణమే తలెత్తింది. అయితే, తనకు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబుకు కర్నూలు జిల్లాలో మంత్రి అఖిల ప్రియ చేస్తున్న తెరవెనుక రాజకీయాలను ఏవీ సుబ్బారెడ్డి వివరించారట.
కర్నూలు అభివృద్ధి కోసం మీరు మంజూరు చేస్తున్న నిధుల్లో ఒక్క రూపాయిని కూడా వినియోగించలేదని, కర్నూలు జిల్లా వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల విస్తరణ పనులు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాన పనులు మరుగున పడిపోయాయని అఖిల ప్రియపై ఏవీ సుబ్బారెడ్డి చంద్రబాబుకు వివరించారట. అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చినప్పట్నుంచి కర్నూలు జిల్లాలో టీడీపీ ఫీవర్ పూర్తిగా తగ్గిపోయిందని ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ..!2019 ఎన్నికలకోసం ఈ వెయ్యి రూపాయల ప్రకటన ..!
అయితే, ఏవీ సుబ్బారెడ్డి చెప్పిన విషయాలను విన్న చంద్రబాబు నాయుడు నిశితంగా విన్నాడని, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏవీ సుబ్బారెడ్డికే టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించారట. అయితే, ఈ మాట పెళ్లి పనుల్లో ఉన్న అఖిల ప్రియ చెవిన పడిందని, ఆ వెంటనే చంద్రబాబును కలిసేందుకు హుటాహుటిని అమరావతికి బయల్దేరిందని ఆ సోషల్ మీడియా కథనం పేర్కొంది.