పనుల కోసం తమవద్దకు వచ్చిన వారికి కండువాలు కప్పే సంస్కృతి తమది కాదని, అలాగైతే మనోహర్ రెడ్డి పనికొసం తన ఇంటికి వచ్చినప్పుడు మొదటి కండువా అతనికే కప్పే వాన్నని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు పేర్కొన్నారు. శుక్రవారం పాలకుర్తి మండలం రాణాపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావెశంలో ఆయన మాట్లాడారు. అవసరానికి తమతొ పనులు చేయించుకుని సిపాయి మాటలు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. తాము ఓటు వేసిన ప్రజల ఋణం తీర్చుకోవడానికి స్థానికంగా అందుబాటులో ఉంటూ సేవ చెస్తున్నామని తెలిపారు.
అర్దరహిత ఆరోపణలు చేసే ప్రతిపక్ష నాయకులు, వాళ్ల నాయకుడు పెద్దపల్లిలో, హైదరాబాద్ లో ఏసీల్లో తిరుగుతున్నారని తెలిపారు. టీఆరెస్ పార్టీకి పనుల కోసం వచ్చే వారికి కండువాలు కప్పే దుస్థితి లేదని, ఇలంటి ప్రకటనలు చేసే మనోహర్ రెడ్డి అనే వ్యక్తి తాను గెలిచిన కొత్తలోనే పనికోసం కాళ్ల బేరానికి వచ్చినా ఆయనకు పనిచేసిపెత్టాం కాని కండువా కప్పుకోమని చెప్పలేదని అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎవరిది రాక్షస పాలనో ప్రజలు గమనిస్తున్నారని, గడిచిన పదిహేనేళ్లలో రాణాపూర్ లో ఎలాంటి పరిపాలన సాగింది, ప్రస్తుతం ఎలాంటి పనులు జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
మంత్రిగా ఉన్న సమయంలో ఎల్లమ్పల్లి పైపులైన్ కు చెరువు నింపేందుకు పైప్ లైన్ వేయించలేని వారు ఇప్పుడు బీరాలు పలుకడం సిగ్గుచేటన్నారు. తాను బ్రతికున్నంత వరకు ప్రజసేవకే అంకితమవుతానని, ప్రజాసంక్షేమమే తన ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేకల సంపత్ యాదవ్, టీఆరెస్ మండల అధ్యక్షులు పి. కిషన్ రెడ్డి, పూదరి సత్యనారాయణ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ మల్క రామస్వామి, నాయకులు పీట్ల గోపాల్, ఇనగంటి భాస్కర్ రావ్, ఇనగంటి రామారావ్, పుల్లెల కిరణ్, బేతు కుమార్, రఘుప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.