ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ కథ రచయిత ..దర్శకుడు ..నిర్మాత ..నటుడు..అన్నిటికి మించి మంచి మనసున్న వాడు పోసాని కృష్ణమురళి .టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు కథ ,మాటలను అందించిన చాలా సినిమాలని తన దర్శకత్వంలో తెలుగు ప్రజలకందించడమే కాకుండా వందల సినిమాల్లో నటించారు.ఎవరన్న కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఉన్నఫలంగా స్పందించి అండగా ఉంటారు పోసాని .
తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షీలో ప్రసారమైన వెన్నుతడితే బంగారు భవితే అనే శీర్షిక పోసాని కృష్ణమురళి గార్ని ఆకట్టుకుంది .దీనికి స్పందించిన పోసాని గారు నిన్న గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని సాక్షీ కార్యాలయానికి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదోతరగతి ఫలితాల్లో సత్తా చాటిన రశ్మిత (9.8జీపీఏ ,వనస్థలిపురం జెడ్పీహెచ్ఎస్ ),టి రాజేశ్వరి (9.7జీపీఏ ,సూరారం జెడ్పీహెచ్ఎస్ ),సఖినాబి (9.5జీపీఏ ,ఘట్కేసర్ జెడ్పీహెచ్ఎస్ )లకు లైవ్లో ఉన్నత చదువుల కోసం తలో లక్ష యాబై వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు.
అంతే కాకుండా ఏకంగా త్వరలో కళాశాల ప్రారంభమవుతాయి కాబట్టి కొత్త బట్టలు కొనుక్కొని సరదాగా కుటుంబంతో గడపమని మరో పది వేల రూపాయలను ముగ్గురికిచ్చి గొప్ప మనస్సును చాటుకున్నారు పోసాని ..ఎంతైనా పోసాని గ్రేట్ కదా ..మీరు హ్యాట్సాప్ చెప్పండి ..