ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగంలేని ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనీ టీడీపీ పార్టీ నిలబెట్టుకుంది. ఈ మేరకు నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం అనంతరం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆ వివరాలను వెల్లడించారు.
see also :
ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే ” జగన్ ఖచ్చితంగా సీఎం ” అవుతాడు..సూపర్ స్టార్ కృష్ణ
నిరుద్యోగ భృతి పొందడానికి కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలని … అలాగే తెల్లకార్డు, 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు తప్పనిసరి అని తెలిపారు . ఒక కుటుంబంలో ఒక్కరికే నిరుద్యోగ భృతి ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు.నిరుద్యోగ భృతి కారణంగా రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.1200 కోట్ల భారం పడుతుందని తెలిపారు. 2018-19 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు.