అలనాటి మేటి నటి సావిత్రి జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతీ పాత్రను అద్భుతంగా చెక్కి సినిమాకు ప్రాణం పోశారు. సావిత్రిగా కీర్తి సురేష్, జెమినీ గణేషన్‌గా దుల్కర్, ఏఎన్ఆర్‌గా నాగచైతన్య, ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ తదితర నటీనటులు వారి వారి పాత్రల్లో జీవించేశారు. ఇంత మంది ఇన్ని పాత్రలు చేసిన మూవీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే, అందరికంటే ఎక్కువ మార్కులు పడింది సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌కే.
ఆ పాత్రల్లో ఆమె చూపిన అభినయం అందరి మనస్సులను దోచింది. ఈ సందర్భంగా చిత్ర షూటింగ్‌లో జరిగిన కొన్ని సన్నివేశాలను ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే, సావిత్రిని మోసం చేసింది. ఆమె కూతురు విజయ ఛాముండేశ్వరినేనని దర్శకుడు కేవీ చౌదరి మనుమరాలు ఓ ఆడియో టేప్‌ను రిలీజ్ చేయడం సంచలనమైంది. సావిత్రిపై ప్రేమ ఉన్నట్టు విజయ నాటకాలు ఆడుతుందని, సావిత్రి చివరి రోజుల్లో అందరికన్నా కూతురు చేసిన అన్యాయం ఆమెను ఎక్కువగా బాధపెట్టాయని ఆడియో టేప్‌లో చెప్పారు. సావిత్రికి మందు అలవాటు ఆమె తల్లి, పెదనాన్నల వల్లే వచ్చిందని ఆ టేప్‌లో పేర్కొంది.