ఎన్నో త్యాగాలు ,ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడి రేపటికి నాలుగేళ్ళు.గత నాలుగేళ్ళ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా పేరు సంపాదించుకున్నారు.ముఖ్యంగా రైతులకోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక పథకాలను ప్రవేశ పెట్టారు.అందులోభాగంగానే సీఎం కేసీఆర్ ఇటీవల రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా పంట పెట్టుబడి కింద ఎకరానికి 4000 చొప్పున సంవత్సరానికి 8000 రూపాయలు రైతుబంధు పథకం పేరుతొ రైతన్నలకు అందజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు కార్యక్రమానికి ఆకర్షితులై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని కూకట్ పల్లి నగరానికి చెందిన టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు పాటిమీది జగన్మోహన్ రావు తన కార్యాలయం వద్ద రైతు బంధవుడు , ముఖ్యమంత్రి కేసీఆర్ Semi 3డి ఆర్ట్ చిత్రాన్ని వేయించి ముఖ్యమంత్రి గారిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు .తెలంగాణ రైతన్నలకు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.