తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇకపై ఈ అంతర్గత పోరు తగ్గే అవకాశమే లేదని టీడీపీ మంత్రులు తెగేసి చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగిన మహానాడులో టీడీపీ మంత్రులు నవ్వుతూనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీంతో విస్తుపోవడం టీడీపీ కార్యకర్తల వంతైంది.
వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ సభ
అయితే, అంతర్యుద్ధం నడుస్తున్న టీడీపీ మంత్రుల్లో మొదటగా చెప్పుకోవాల్సిన వారు గంటా శ్రీనివాసరావు. అయ్యన్న పాత్రుడు. ఇద్దరూ విశాఖ జిల్లాకే చెందిన వారైనా.. వీరి మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనేంతలా వివాదాలు ఉన్నాయి. ఇది పాత విషయమే అయినా.. వీరి మధ్య ఉన్న వైరం మరోసారి బయటపడింది.
ఏవీ సుబ్బారెడ్డికి సీఎం చంద్రబాబు ఫోన్..!
అయితే, ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో తనకు తెలియకుండా డీఎల్ఎస్‌సీ కమిటీని మంత్రి గంటా శ్రీనివాసరావు నియమించారని, ఈ విషయంపై మంత్రి అయ్యన్న పాత్రుడు గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా పశు సంవర్ధకశాఖ జేడీ కోటేశ్వరరావును, అలాగే, సూర్య ప్రకాష్‌రావులను బదిలీ చేస్తూ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆదేశాలు జారీ చేస్తే.. వాటిని ఖాతరు చేయకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు వారిద్దరినీ మళ్లీ విశాఖ జిల్లాకే నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మనస్థాపానికి గురైన మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదట. తన సమస్యను పట్టించుకోకపోగా.. మంత్రి గంటా శ్రీనివాసరావుకే సీఎం చంద్రబాబు సపోర్టు చేయడాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీరును నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు అయ్యన్న పాత్రుడు సిద్ధమయ్యాడంటూ ఓ సోషల్ మీడియా కథనం పేర్కొంది.