వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .ఆ పత్రిక మరియు ఛానెల్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు రాస్తుంది .నడవమన్నట్లు నడుస్తుంది అని ఇటు రాజకీయవర్గాలు అటు నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తారు .అలాంటి పత్రిక ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి,అతని పార్టీ నేతలపై ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు విషం చిమ్మేది.
అయిన గత సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల నుండి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే ,దివంగత మాజీ గవర్నర్ అయిన కోన ప్రభాకర్ రావు తనయుడు కోన రఘుపతి ఈసారి వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపొందుతుందని షాకింగ్ రిపోర్టు ను ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .గత నాలుగు ఏండ్లుగా అధికారం లేకపోయిన టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించకపోయిన సరే ఎమ్మెల్యే కోన రఘుపతి తన సొంత డబ్బులతో నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నియోజకవర్గ ప్రజల మన్నలను పొందుతున్నారు .అయితే ఒక పక్క అధికారం లో లేకపోవడం వలన తాము ఓట్లేసి గెలిపించిన అనుకున్నట్లు అభివృద్ధి చేయకపోయిన అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే చాలా బెటర్ అని అభిప్రాయంలో ఉన్నారని ఓటర్లు అంటున్నారు అని ఆ పత్రిక ప్రచురించింది .
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే..బీజేపి ఎమ్మెల్సీ
అధికార పక్షం సహకరించకపోయినా కానీ సూర్యలంక సముద్రతీరంలో ఉన్న ఆక్రమణలు తొలగించడమే కాకుండా సొంత నిధులు కేటాయించి మరి దుఖాణాలు నిర్మించి గ్రామపంచాయితీ లకు అప్పజెప్పారు .అంతే కాకుండా పట్టణంలో ప్రఖ్యాత గాంచిన శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీసమేత క్షీరభావన్నారాయణస్వామి దేవాలయం గాలిగోపురం పునర్నిర్మాణ పను లను వేగవంతం చేయించారు.
బాపట్ల ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఎమ్మెల్యే రఘుపతి ఆసుపత్రిని ప్రభుత్వ నిధులతోపాటు సొంత నిధులు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దారు. ఆసుపత్రికి ఆదాయం వచ్చేవిధంగా క్యాంటీన్, సైకిల్ స్టాండ్ రైల్వేస్టేషన్‌వైపు ఏర్పాటు చేశారు. దీనికి సొంత నిధులు వెచ్చించారు. నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆపదలో ఉన్న రోగులకు సాయం చేయడం వలన ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడి వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పత్రిక ప్రచురించింది .పశ్చిమ నుండి తూర్పులోకి అడుగు పెట్టబోతున్న.. వైఎస్ జగన్