ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. అంతేగాక జగన్ తో పాటు వేలాది మంది పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను జగన్ చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇంకా తలశిల రఘురాం మాట్లాడుతూ… జిల్లాలో ఒకదానిని మించి మరొకటి అనేలా ఘనంగా బహిరంగ సభలు జరుగుతున్నాయన్నారు. అడుగడుగునా వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని పేర్కొన్నారు. జూన్ 2వ వారంలో ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని అన్నారు. గోదావరి నదిపై మూడుచోట్ల సంకల్పయాత్ర వంతెనలను దాటుతుందని తలశిల రఘురాం వెల్లడించారు.
