ఏపీ మొత్తం అధికార టీడీపీ పార్టీ పై రాజకీయ నేతలు.. సామన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలుగు తమ్ముళ్లకు నిద్రపట్టడం లేదు. ప్రతి రోజు ఎదో ఒక స్కామ్, హత్యలు, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు ఇలా ప్రతి దాంట్లో అడ్డంగా దొరుకుతున్నారు. మరికొందరు బహిరంగంగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరో సారి బాబును టార్గెట్ చేశారు. నాకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పుతానని బాబు చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నదే 25 ఎంపీ సీట్లు ఈ మాత్రం ఎంపీలతో బాబు ఢిల్లీలో ఎలా చక్రం తిప్పుతారో చెప్పాలని ఉండవల్లి ప్రశ్నించారు. ఓటింగ్ సరిగా నిర్వహించలేదని, పార్లమెంట్ తలుపులు మూసేసి ఏపీకి అన్యాయం చేశారు. లైవ్ ప్రసారాలు ఉండి ఉంటే ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలిసేవి. కేంద్రం ఇచ్చిన నిధులపై అడిగే హక్కు ఎవరికి ఉందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపితే తప్పేంటని సీఎం చంద్రబాబును ఉండవల్లి ప్రశ్నించారు. 2008 అసెంబ్లీ సమావేశాల్లో టీటీడీ నిర్వహణపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా మాజీ ఎంపీ గుర్తుచేశారు.