ప్రస్తుతం చాలా మంది యువతీ ,యువకులు హెయిర్ ఫాల్ సమస్యతో బాధ పడుతున్న విషయం తెలిసిందే.ఈ సమస్య ద్వారా అనేకమంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.మరికొందరు అయితే బట్టతల వస్తుందేమో అని కంగారు పడుతున్నారు.అయితే ఆ సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరుకున్న అనేక షాంపూలను, క్రీములను, ఇతర పదార్థాలను వాడుతున్నారు. అయితే వాటితో పనిలేకుండా మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే జుట్టు రాలడం సమస్యను ఈ క్రింది టిప్స్ ద్వారా తగ్గించుకోవచ్చు ..
see also :ఈ వయసులో అమ్మాయిలు సెక్స్ కోసం వారి వద్దకు… అబ్బాయిలు వీరి వద్దకు…!
- కుంకుడు కాయలను పగలగ్గొట్టి వాటిలోని గింజలను తీసేయాలి. అనంతరం వాటిని వేడి నీటిలో కొంత సేపు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని పిండి రసం తీసి దాంతో తలస్నానం చేయాలి. రెగ్యులర్‌గా ఈ టిప్‌ను పాటిస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
- అలోవెర (కలబంద) ఆకును కట్ చేసి అందులో ఉండే గుజ్జును అలాగే జుట్టుకు రుద్దాలి. కొంత సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. దీంతోపాటు ఇతర జుట్టు సమస్యలు కూడా పోతాయి.
- ఉసిరికాయను పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి తర్వాత జుట్టుకు పట్టించాలి. అనంతరం తలస్నానం చేయాలి. వీటిలో ఉండే ప్రోటీన్ పదార్థం, విటమిన్ సి, ఇతర న్యూట్రియంట్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
- మూడు టీ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకొని అందులో కొద్దిగా నీళ్ళు సోసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని తలకు పట్టించాలి. కొంత సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే తప్పక ఫలితం లభిస్తుంది.
- కొద్దిగా శనగ పిండి తీసుకుని అందులో పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని తలకు పట్టించాలి. ఆ తరువాత కొంత సేపటికి స్నానం చేయాలి. దీంతో జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.