వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లేనని బీజేపి ఎమ్మెల్సీ మాదవ్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో టీడీపీ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. తిట్ల దండకంతో మహానాడులో బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. చంద్రబాబు ఖబడ్దార్.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామస్మరణతో మహానాడు జరిగింది. టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీజేపీ నేతలపై పగ, ప్రతీకారంతో మాట్లాడుతున్నారని’ మాధవ్ ద్వజమెత్తారు.‘బీజేపీని తిట్టినవారికి బహుమతి అనేలా మహానాడులో ప్రసంగాలు చేశారని ఆయన అన్నారు. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో చూపిస్తాం అంటు సవాలు విసిరారు.
