ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 175 రోజులనుండి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మండుటెండను సైతం లేక్కచేయకుండ జగన్ ఇప్పటివరకు 2200 కిలోమీటర్ల నడిచారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో కొనసాగుతుంది.అయితే గత రెండు రోజులనుండి జగన్ స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు.ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. తీవ్ర ఎండలు, వేడికారణంగా అనారోగ్యానికి గురయ్యారని అక్కడి వైద్యులు చెప్పారు. మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినా జగన్ బుధవారం పాదయాత్ర కొనసాగించారు.ఈ క్రమంలోనే వైద్యుల సూచన, పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు ఈ రోజు పాదయాత్రకు విరామం ప్రకటించారు.రేపటి నుండి పాదయాత్ర యథావిధిగా కొనసాగనుంది.
