ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే అధికార టీడీపీ పార్టీ కి చెందిన నేతలపై ,ఎమ్మెల్యేలపై ప్రజలు ఎదురుతిరుగుతున్నారు . గతనాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సంగతి తెల్సిందే .
తాజాగా తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధికి అడ్డుపడుతూ ..నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించే రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యేపై స్థానికులు తిరగబడ్డారు .
ఈ క్రమంలో కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చేస్తున్న ప్రజాభిసేకరణకు అడ్డుపడుతున్న స్థానిక అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ను ప్రజలు నిలదీస్తూ బాబు అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు .అది లేదు ..ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి అన్నారు అది లేదు .ఇవన్నీ ఇవ్వకుండా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న మీరు ఎలా ఎమ్మెల్యే అవుతారు అంటూ ప్రజలు ఎదురుతిరగడంతో అక్కడ నుండి వెళ్లిపోవడం ఆయన వంతైంది ..