టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి మొదలు కానుంది. అయితే, ఈ చిత్రాన్ని టాలీవుడ్ బఢా నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో ఓటమి ఎరుగని నిర్మాతగా పేరొందిన దిల్ రాజు.. ఇటీవల వరుస సక్సెస్‌లతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.
అందులోను, వంశీ పైడిపల్లి మహేష్‌బాబు కోసం ఓ కొత్త కథను రెడీ చేశారట. ఈ చిత్రంలో ధనికుడిగా మహేష్‌బాబు, కుచేలుడిగా అల్లరి నరేష్ కనిపించనున్నారట. ఓ గొప్పింటి ధనికుడు.. పేదింటి స్నేహితుడిని ఎలా ఆదుకుని పైకి తీసుకు వచ్చాడన్నదే ఈ చిత్రం కాన్సెప్ట్. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు కనిపించడం, మల్టీస్టారర్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.