తెలంగాణ రాష్ట్ర ఎం.బీ.సీ కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “కాళేశ్వరం” ప్రాజెక్ట్ నిర్మాణపనులు జరుగుతున్న ప్రాంతాలని సందర్శించారు.
తెలంగాణ రాష్ట్రం లో పూర్తి గా కరువు వచ్చిన 365 రోజులు రాష్ట్రం మొత్తం నీరందించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా వారే ఒక “ఇంజనీర్” లాగా మారి ఈ కాళేశ్వరం మహా ప్రాజెక్టును తీర్చిదిద్దారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.మొదటగా ఆయన కన్నెపల్లి లో 3000 కోట్లతో నిర్మిస్తున్న పంప్ హౌస్ పనులు సందర్శించారు.
అనంతరం అన్నారం వద్ద 66 గేట్లతో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజ్ ను సందర్శించడం జరిగింది, అక్కడి ఇంజనీర్లను పనితీరు అడివి తెలుసుకున్నారు. అనంతరం మెడిగడ్డ వద్ద నిర్మిస్తున్న 1850 కోట్లతో 88 గేట్ల సామర్థ్యం నిర్మిస్తున్న మెడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు. వారికి అక్కడి ఇంజనీర్లు ప్రాజెక్టు విధివిధానాలు, పనులు జరుగుతున్న తీరును వివరించారు.