ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. అయితే, ఇడుపులపాయ నుంచి జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా ఇలా ఎనిమిది జిల్లాల్లో జగన్ తన పాదయాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా జగన్ తన పాదయాత్రను మరికొద్ది రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే తూర్పు గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అయితే, తూర్పుగోదావరి జిల్లాల్లో జూన్ రెండవ వారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందన్నది వైసీపీ నేతల మాట.
జేసీ దివాకర్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్..!!
ఇలా జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించినప్పటి నుంచి అధికార పార్టీ నేతల నుంచి ఇతర పార్టీ నేతలు కూడా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను గమనించిన తూర్పు గోదావరి టీడీపీ నేతలకు ఇప్పట్నుంచే ముచ్చెమటలు పడుతున్నాయి. జగన్ పాదయాత్ర తమ జిల్లాల్లోకి ఎంట్రీ ఎప్పుడు అవుతుందోనని, ఎప్పుడు పూర్తవుతుందోనన్న విషయాలపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. దీనికంతటికి కారణం తమ పార్టీకి చెందిన కొందరు నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవడమేనంట.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే..బీజేపి ఎమ్మెల్సీ
మరో పక్క తూర్పుగోదావరి జిల్లాల్లో టీడీపీ కీలక నేతగా ఉన్న ఎంపీ మురళీ మోహన్ కూడా మరో అడుగు ముందుకేసి వైసీపీ నేతలకు గాలం వేస్తున్నారట. జగన్ పాదయాత్ర జిల్లాల్లోకి ప్రవేశించగానే వైసీపీకి చెందిన నేతలను టీడీపీలోకి ఆహ్వానించేందుకు భారీగానే ఖర్చు చేస్తున్నారంట. ఇందుకు సంబంధించి ఇటీవల రాజమండ్రిలో జరిగిన మినీ మహానాడులో తీర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఏదేమైనా.. టీడీపీ నేత, ఎంపీ మురళీ మోహన్ ఎన్ని డబ్బు మూటలు చూపినా టీడీపీలో చేరేది లేదంటూ తూర్పు గోదావరి వైసీపీ శ్రేణులు కంఠాపథంగా చెబుతున్నారు.