ప్రముఖ దర్శక, నిర్మాత విక్రమ్ భట్ రూపొందించిన మాయ వెబ్ సిరీస్ సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. మాయా2కు విక్రమ్ స్వీక్వెల్‌గా రూపొందించడమే కాకుండా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో ప్రియాల్ గోర్, లీనా జుమానీ కీలక పాత్రలను పోషించారు. మాయ2 ట్రైలర్‌లోని గోర్, లీనా ముద్దు సన్నివేశాలు కాకపుట్టిస్తున్నాయి. హాట్ హాట్‌గా ఉన్న ట్రైలర్‌పై సినీ వర్గాలు చర్చించుకొంటున్నాయి. మాయా2 ట్రైలర్‌ను ఇంటర్నెట్, సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రియాల్ షేర్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది. ముద్దు సీన్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణమైన కామెంట్లు విసిరారు. అయితే ట్రోల్స్‌ను తాను పట్టించుకొను అని ప్రియాల్ స్పష్టం చేశారు.
ట్రైలర్ చూసిన తర్వాత ఒకరకమైన స్పందన రావడం చాలా సహజం. ఎందుకంటే నేను హోమో సెక్సువల్ పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. అందుకే ఆడియెన్స్ చాలా షాక్‌కు గురయ్యారు. మాయ2లో బోల్డ్ సీన్లు చాలా ఎక్కువగానే ఉంటాయి. ట్రైలర్‌లో కనిపించిన సీన్ల మాదిరిగానే ఇంకా చాలా ఉంటాయి. ప్రోమో చూస్తే అసలు విషయం మీకు ఖచ్చితంగా బోధపడుతుంది. కేవలం శృంగారమే కాదు, ప్రేమ, భావోద్వేగాలు లాంటి అంశాలు ఎన్నో ఉంటాయి. కేవలం ముద్దు సీన్‌పై ఫోకస్ చేస్తే అది వల్గర్‌గా కనిపిస్తుంది. కానీ కథ మొత్తం చూస్తే అద్భుతంగా ఉంటుంది అని ప్రియాల్ వెల్లడించారు.