సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో . అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార విపక్షాలు అయిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కల్సి ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్లో కీలక పాత్రధారి ఆయన అని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు వైఎస్సాఆర్ అభిమానులు ,వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ .
అయితే వీరు ఆరోపిస్తున్నట్లుగా అవన్నీ అక్రమ కేసులని ..ఒక్కదాంట్లో కూడా నిజంలేదని కోర్టులు తీర్పునిస్తూ ఒక్కొక్క కేసును కొట్టివేస్తుంది . ఈ నేపథ్యంలో ఆయన తన ఐపీ ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు లక్ష్మీ నారాయణ .అయితే నారాయణ టీడీపీ పార్టీలో చేరతారు అని కొందరు ..లేదు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని మరికొందరు ప్రచారం చేస్తూ వస్తున్నారు .తాజాగా అవేమి కాదు ఆయన ఏకంగా బీజేపీ పార్టీలో చేరతారు అని ఇంకొందరు వార్తలను ప్రచారం చేస్తున్నారు .
ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ తనపైన జరుగుతున్నా ప్రచారానికి క్లారీటీ ఇచ్చారు .ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు న్యాయం చేయలేకపోయాయి . తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఏపీ ప్రజలకు ఇరు ప్రభుత్వాలు ఏమి న్యాయం చేయలేదు .రైతన్నలు సబ్సీడీలు ,పథకాలను కోరడంలేదు .వారు పండించిన పంటకు మద్దతు ధరను ఇస్తే చాలు .తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని వస్తున్నా వార్తల్లో వాస్తవం లేదు .త్వరలోనే రాష్ట్రమంతా పర్యటిస్తాను .ఆ తర్వాత తన పొలిటికల్ ఎంట్రీ మీద ..ఏ పార్టీలో చేరతానో అనే పలు అంశాల మీద క్లారిటీ ఇస్తాను అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు ..