తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అధునాతన బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . మహానగరంలోని 826 ప్రాంతాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో మంచి బస్ షెల్టర్లు కడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా సోమాజిగూడ, కూకట్ పల్లిలో బస్ షెల్టర్లు, ఏటీఎం మిషిన్, క్యాంటీన్, మోడ్రన్ టాయిలెట్ ను మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు . GHMC,PPP సంయుక్తంగా ప్రపంచస్థాయి బస్ షెల్టర్ల నిర్మాణం చేపడుతున్నాయన్నారు. రాబోయే 6 నెలల్లో బస్సు షెల్టర్లు పూర్తి చేస్తామని… త్వరలో 3,800 ఆర్టీసీ బస్సులను ఆధునీకరిస్తామన్నారు. అందులో భాగంగా 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.మెట్రో పనులతో వస్తున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని చెప్పారు. కొత్త బస్ షెల్టర్లలో ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీటీవీ సౌకర్యం, ఎమర్జెన్సీ హారన్, మొబైల్ ఛార్జింగ్, డస్ట్‌బిన్లు, టికెట్ల కౌంటర్లు, ఫీడింగ్ రూమ్, మంచినీరు వంటి మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు మంత్రి కేటీఆర్.హైదరాబాద్ విశ్వనగరంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకుంటామన్నారు.
Ministers @KTRTRS and Jagadish Reddy inaugurated a Modern AC bus shelter near RTA Office, Khairatabad. MLA @ChintalaRReddy, Mayor @bonthurammohan, @CommissionrGHMC Janardhan Reddy participated in the program. pic.twitter.com/DKQDtnSNd9
— Min IT, Telangana (@MinIT_Telangana) May 31, 2018
A Modern AC bus shelter was inaugurated by MA&UD Minister @KTRTRS in Kukatpally, today. Serilingampally MLA @GandhiArekapudi and Mayor @bonthurammohan participated in the program. pic.twitter.com/dIEgI2FfQA
— Min IT, Telangana (@MinIT_Telangana) May 31, 2018