Home / ANDHRAPRADESH / జేసీ దివాక‌ర్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్‌..!!

జేసీ దివాక‌ర్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్‌..!!

ఇటీల విజ‌య‌వాడ కేంద్రంగా టీడీపీ మ‌హానాడు కార్య‌క్ర‌మం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన‌న్ని రోజులు కూడాను ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ కార్య‌క‌ర్త‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు విమ‌ర్శ‌ల వ‌ర్శం కురిపించారు. మ‌హానాడులో ప్ర‌జ‌ల కోసం ఏం చేస్తున్నామో చెప్పాల్సిన టీడీపీ ప్ర‌భుత్వం.. అవేవీ ప‌ట్ట‌న‌ట్లు కేవ‌లం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి మాత్ర‌మే మ‌హానాడును నిర్వ‌హించింది. ఇలా టీడీపీ నేత‌లు ఒక్క‌క్క‌రిగా జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు.

అయితే, టీడీపీ మ‌హానాడును సోష‌ల్ మీడియాలో తిల‌కించిన నెటిజ‌న్లు.. చంద్ర‌బాబు స‌ర్కార్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఏం చేస్తున్నారో చెప్పాల్సింది పోయి.. స‌భ‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తారా..? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అత‌ను మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డిపై విరుచుకు ప‌డ్డారు. నువ్వు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని, దివంగ‌త నేత రాజారెడ్డిని విమ‌ర్శిస్తావా..? అంటూ ప్ర‌శ్నించారు. తెలుగుదేశం మ‌హానాడు కాదు.. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తిట్టే కార్య‌క్ర‌మంలా నిర్వ‌హించారు. తెలుగుదేశం పార్టీకి 2019లో భ‌విష్య‌త్ ఉండ‌ద‌న్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ టిక్కెట్ కోసం జ‌గ‌న్‌ను క‌లిసేందుకు కాళ్లు అరిగేట‌ట్లు తిరిగిన రోజులు మ‌రిచిపోయావా..? అంటూ గుర్తు చేశారు. సిగ్గుందా నీకు అంటూ దివాక‌ర్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. కోట్లు విలువ చేసే భూములను క‌బ్జా చేసిన నీవు జ‌గ‌న్ ను విమ‌ర్శిస్తావా..? నీవ‌ల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయో మ‌రిచిపోయావా..? అంటూ ప్ర‌శ్నించారు. ఇంకోసారి జ‌గ‌న్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. తోలు తీస్తానంటూ ఆ నెటిజ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat