తెలుగు సినిమా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా తన అభిమానులు ఘనగా జరుపుకుంటున్నారు.అయన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు కూడా కృష్ణ కి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే తన పుట్టిన రోజును పురస్కరించుకొని కృష్ణ ఓ ప్రముఖ టీ వీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను అయన వెల్లడించారు.రాజీవ్ గాంధీ కోసమే తాను రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.ఆయనే స్వయంగా రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారని తెలిపారు.
ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో తనకున్న అనుభవాలను పంచుకున్నారు.అయితే ఓవరాల్ గా ఏ ముఖ్యమంత్రి అంటే ఇష్టమని ఆ విలేకరు అడుగగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఇష్టమని అన్నారు .వాళ్ళ అబ్బాయి జగన్ పాదయాత్ర చేస్తున్నారు కదా.. మీరు ఎట్లా అనుకుంటున్నారు..? అని అడుగ్గా.. జగన్ ను జనం భాగా రిసీవ్ చేసుకుంటున్నారు.జగన్ ఏ ఉరు వెళ్ళినా ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారని చెప్పారు.మండుటెండలో నడవటం అనేది అందులో మే నెల లో ప్రజలకోసం నడవటం చాలా అభినందించాల్సిన విషయమన్నారు.వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతారా..? అని ఆ విలేకరు అడుగగా ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్ చూస్తే జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. జగన్ ఎక్కడ ఎప్పుడు కలిసినా మంచిగా పలుకరిస్తారని చెప్పారు.