ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సంస్కృతం, ఉర్దూ, అరబిక్, హిందీ సవరించిన పాఠ్యపుస్తకాలు, అకాడమిక్ ఆర్గనైజర్ ను మంత్రులనివాస ప్రాంగణం, బంజారాహిల్స్ లో నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ నాలుగు పాఠ్యపుస్తకాలను 2013లో సవరించగా, ఐదేళ్లకొకసారి సవరించాల్సి ఉంది. పుస్తకాలను సవరించి ఐదేళ్లు కావడంతో ఇప్పుడు ఈ పుస్తకాల సిలబస్ ను ఇంటర్ బోర్డు సవరించింది. ఇంటర్ బోర్డులోని కమిటీ సవరించగా, తెలుగు అకాడమీ వీటిని ముద్రించింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రంజీవ్ ఆర్.ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, తెలుగు అకాడమీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఇంటర్ జేఏసీ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి, జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షుడు నర్సిరెడ్డి, పరీక్షల విభాగం జాయింట్ సెక్రటరీ నారాయణరెడ్డి, ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వింగ్ రీడర్ ఉపేందర్ రెడ్డి,అసిస్టెంట్ ప్రొఫెసర్ వసుంధర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
