ప్రముఖ దర్శకుడు మృతి.. విషాదంలో చిత్ర సీమ..! కర్ణాటక చిత్ర సీమలో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు పలువురి ప్రాణాలను తీస్తున్నాయి. ఈ క్రమంలోనే కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు సంతోష్ శెట్టి కటిల్ ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరద ఉద్రిక్తతకు కొట్టుకు పోయారు. దీంతో సంతోష్ శెట్టి కటిల్ ప్రాణాలు కోల్పోయారు.
సంతోష్‌శెట్టి కటిల్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంతోష్‌శెట్టి మృతితో కన్నడ చిత్రసీమ దుఃఖసంద్రంలో మునిగిపోయింది. సంతోష్ శెట్టి ఇలా మృతి చెందడం బాధాకరమని కన్నడ సినీ ప్రముఖులు ఆయన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు.