వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ఇడుపులపాయ మొదలుకొని ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. మున్ముందు కూడా విజయవంతంగా కొనసాగుతుందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, ఇటీవల జగన్ దెందులూరు నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో ఆటో వాలాలు తమ ఆటోలతో సమా వచ్చారు. జగన్‌ను కలుసుకుని వారి వారి సమస్యలను తెలుపుకున్నారు. ఆటో వాలాల సమస్యలను విన్న జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి రూ.10వేలు చెప్పున ఆర్థిక సాయం అందిస్తానని ఆటోవాలాలకు భరోసా ఇచ్చారు.
అయితే, వైసీపీలో జగన్‌కు నమ్మిన బంటుగా వ్యవహరిం ఎమ్మెల్యేల్లో.. నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఒకరు. జగన్ ప్రజలకు ఏ హామీ ఇచ్చానా.. ఆ హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే క్రమంలో అనీల్ ముమ్మర ప్రచారం చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే జగన్ ఆటోవాలాలకు ఇచ్చిన హామీని సైతం అనీల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో ప్రచారం చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రచారం మొదలు పెట్టారు. ఆటోవాలాలకు జగన్ చెప్పిన హామీని బలంగా దూసుకెళ్లేలా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు నిర్ణయించడం హర్షణీయమన్నారు. ఆటో వాలాల కోసం ఏ నాయకుడు చేయని, ఇవ్వని హామీని వైఎస్ జగన్ ఇచ్చారన్నారు.