పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి.వరుసగా రెండో రోజు ఆయిల్ కంపెనీలు ధరలను తగ్గించాయి.బుధవారం ఒక్క పైసా తగ్గించిన కంపెనీలు…తాజాగా ఈ రోజు అదే విధంగా తగ్గించా యి.లీటర్ పెట్రోల్ పై 7 పైసలు,లీటర్ డీజిల్ పై 5పైసలు తగ్గిస్తునట్లు ప్రకటించాయి.అయితే తగ్గిన రేట్ల ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.42 నుంచి రూ.78.35కు దిగొచ్చింది. అదేవిధంగా డీజిల్ ధర కూడా లీటరు రూ.69.25గా నమోదైంది.
ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వం పై ప్రజలు మండిపడుతున్నారు.పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచేటప్పుడు 4,5 రూపాయలు పెంచుతూ..తగ్గించేటప్పుడు మాత్రం ఒక్క పైసా,5 పైసలు తగ్గిస్తున్నరంటూ మండిపడుతున్నారు.కాగా 16 రోజుల పాటు వరుసగా ధరలు పెరగడంతో, లీటరు పెట్రోల్‌పై రూ.3.8, డీజిల్‌పై రూ.3.38 ధర పెరిగిన విషయం తెలిసిందే.