యూపీఏ,యూపీఏ1 ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసురు తగిలిందా .. అప్పటి ఉమ్మడి ఏపీ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంతవరకు మంచివాడిగా కనిపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అకాలమరణాన్ని తట్టుకోలేక పోయి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి ఓదార్పు యాత్రగా బయలుదేరగానే చెడ్డోడుగా కనిపించాడు.
దీంతో అప్పుడు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పి చిదంబరం రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ పార్టీకి చెందిన దివంగత ఎంపీ కింజరాపు ఎర్రంన్నాయుడు ,కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి ఎమ్మెల్యే శంకర్రావు సాయంతో అక్రమకేసులను బనాయించి జగన్ ఆరు నెలలు జైల్లో ఉండటానికి ప్రధాన కారణం అని రాజకీయవర్గాలతో పాటుగా వైసీపీ శ్రేణులు ,వైఎస్ అభిమానులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే వీరు ఆరోపిస్తున్నట్లుగా అవన్నీ అక్రమ కేసులని ..
see also..
కర్నూల్ జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్..ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీలోకి
ఒక్కదాంట్లో కూడా నిజంలేదని కోర్టులు తీర్పునిస్తూ ఒక్కొక్క కేసును కొట్టివేస్తుంది . ఈ క్రమంలో అప్పుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించడానికి పరోక్షంగా ప్రత్యేక్షంగా సహకరించిన వారంతా పొలిటికల్ గా చీకట్లోకి వెళ్లిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం .తాజాగా చిదంబరం ఆ జాబితాలోకి వెళ్లిపోతున్నారు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు .అందులో భాగంగా దేశంలోనే సంచలనం సృష్టించిన ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆయనకు సీబీఐ సమన్లు జారీచేస్తూ తమ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది ..అయితే ఇప్పటికే ఆయన తనయుడు ఇదే కేసులో అరెస్టు అయిన సంగతి తెల్సిందే .