తీవ్ర దుఃఖంలో అంజలి. నిండా ముంచేసిన జయ్. అవును, షాపింగ్ మాల్ చిత్రం ద్వారా తెలుగు వెండి తెరకు పరిచయమైన అంజలి ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉందట. దానికంతటికీ కారణం కోటీవుడ్ నటుడు జయ్ అట. ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీసిన మీడియాకు షాకింగ్ నిజం ఒకటి తెలిసిందట. ఆ షాకింగ్ నిజం ఏమిటంటే..!
ఇటీవల అంజలి, జయ్ ఇద్దరూ ప్రేమపక్షుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే ఒకరిని విడిచి మరొకరు ఉండలేక సహజీవనం కూడా చేసేశారు. ఇలా ఇద్దరూ గాఢ ప్రేమానుభూతిని అనుభవించారు. చివరకు బోరు కొట్టిందో.. ఏమో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరు విడిపోవడానికి కూడా ఒక కారణం ఉందట. అదేమిటంటే..! అంజలి స్లిమ్ అవడంతో ఇటీవల సినిమా అవకాశాలు భారీగా పెరిగాయట. మరో వైపు జయ్‌కు మాత్రం సినిమా అవకాశాలు తగ్గాయట. దీంతో గిల్టీగా ఫీలైన జయ్ అంజలిని కాస్త పక్కనపెట్టేసి సినిమా ఛాన్స్‌ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలోనే తనను పక్కన పెట్టడంతో అంజలి ఒక్కసారిగా దుఃఖసాగరంలోకి వెళ్లిపోయింది.