వైసీపీ నేతలు, కార్యకర్తలపై అధికార టీడీపీ వర్గీయుల దాడులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. వైసీపీ వర్గీయులపై మంత్రి అఖిలప్రియ బంధువులు దాడికి పాల్పడ్డారు. పొలం పంచాయితీ ఉందని మాట్లాడటానికి రావాలంటూ వైసీపీ నేతలు కేఈ శ్రీనివాస్ గౌడ్‌ను, అతడి సోదరులను కొందరు టీడీపీ నేతలు పిలిపించారు. వైసీపీ నేతలు వారు చెప్పిన చోటుకు రాగానే టీడీపీ వర్గీయులు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు.
టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కేఈ శ్రీనివాస్ గౌడ్ అతడి సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. దొర్నిపాడు మండలం కొత్తపల్లెకు చెందిన భూమా బ్రహ్మం, అతడి కుమారులు సహా మరో 20 మంది తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపించారు. పాత కక్షలు ఉండటం, దాంతో తాము అధికారంలో ఉన్నామని టీడీపీ శ్రేణులు దాడి చేశాయని కేఈ శ్రీనివాస్ సన్నిహితులు వాపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.