ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ,జనసేన,వైసీపీ ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల్లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార హాడవీడి మొదలుపెట్టాయి. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఖచ్చితంగా గెలవదు అని ఇప్పటికే ఏన్నో రాష్ట్ర, జాతీయ ప్రముఖ సర్వేలు బట్టబయలు చేశాయి. అందుకు కారణాలు కూడ ఉన్నాయి. 2014 ఎన్నికల వరువాత అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, ఇప్పటి వరకు అంటే అధికారంలోకి వచ్చిన గత 4 సంవత్సరాలనుండి ఏ ఒక్కరికి న్యాయం చేయకపోవడం, నేరాలు, మహిళలపై దాడులు, అక్రమాలు, దోపిడిలు, హత్యలు ఇలా ఏన్నో నేరాలు చేసినట్టు ఆరోపణలు రావడం. గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ ఇచ్చి…బయటికి వచ్చిన జనసేన అధినేత ,టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుని, కొడుకు నారా లోకేష్ ని ఓ రెంజ్ లో అడుకున్నాడు. అత్యంతా అవినీతి మీపాలనలో జరుగుతందని కుండ బద్దలు కొట్టి మరీ భహిరంగగా చెప్పారు.
see also..
వైఎస్ జగన్ కు అస్వస్థత..!
దీనికి తోడు ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పాదయాత్ర మొదలు నుండి ఈ రోజు వరకు చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఏంపీలు, కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారు. ఇటీవల సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వైఎస్ జగన్ను కలిసి మద్దతు ప్రకటించారు. తాజాగా మరో నటుడు పృథ్వీ రాజ్ మంగళవారంవైఎస్ జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ మండుటెండలను లెక్కచేయకుండా పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు. ప్రజల కోసం ఏదో చేయలనే సంకల్పమే ఆయన్ను ముందుకు నడిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారం. బ్రహ్మండంగా తరాలు తిన్న తరగని ఆస్తి ఉన్నటువంటి నాయకుడు కేవలం ప్రజలకోసం ఈ రోజు ఇంత ఎండాలో ప్రజల కొరకు వచ్చాడంటే నిజంగా ఇది గొప్ననాయకుడి లక్షణం అన్నారు . అంతేకాదు జగన్ సంకల్పం నాకు , పోసాని కృష్ణమురళికి ఎంతగానో నచ్చింది.ఇంకా చాలమంది టాలీవుడ్ లో నటులు, నటీమణులు వైసీపీలోకి వస్తారు..అది మీరు చూస్తారని పృథ్వీ అన్నారు. అంటే తెలుగు ఇండస్ట్రీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏవిధంగా వారి సమస్యలను ఒక్కొక్కటిగా పరిస్కరించాడో ..ఇప్పుడు జగన్ అలా పరిస్కరిస్తాడని..వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాడని.. .అందుకే వైసీపీకి టాలీవుడ్ మొత్తం సపోర్ట్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.
see also..