ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత 176 రోజులుగా అలుపనేది లేకుండా నిరంతరం ప్రజా సమస్యలను ప్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజవంతంగా కొనసాగుతుంది. అయితే వైఎస్ జగన్ కు ఉదయం నుంచీ జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడ్డారు. అయినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మూడు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు సూచించారు. రోజూ ఎండలోనే పాదయాత్ర చేస్తున్నందున ఆదివారం తమ అధినేత జగన్ వడదెబ్బకు గురయ్యారని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.
