ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గరకు పడుతున్న కొద్దీ వైఎస్ జగన్ వేసే ఎత్తుగడలు తెలుసుకోలేకపోతున్న ..దానికి తగ్గట్టుగా తాను కూడా ప్రణాళికలు వేయలేకపోతున్నాడన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్ జగన్ వేసిన మొదటి ప్రణాళిక తన ఎంపీల రాజీనామా.అయితే వారి రాజీనామాలను ఇంకా ఆమోదించని స్పీకరు ఈ నెల 5, 7 వ తేదీలలో ఎంపీలతో మీటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది.
ఇందులో ఒక విషయాన్ని గమనిస్తే ప్రత్యేకహోదా ఇవ్వలేదని రాజీనామా చేపించి ప్రజలలో మంచి మార్కులు కొట్టేశాడు జగన్, అంతేగాక రాజీనామా చేసిన స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహిస్తే గనుక నిజంగానే ప్రత్యేకహోదా కోసం చాలా డేర్ చేసాడనే నమ్మకాన్ని ప్రజలలో ఇంకా బలంగా తీసుకెళ్లిన వాడవుతాడు. ఉప ఎన్నిక అన్న విషయాన్ని పక్కన పెడితే రాజీనామా ఆమోదించాలి అనేది వైసీపీ వారి వాదన. అయితే స్పీకరు జూన్ 5 వ తేదీన ఏ నిర్ణయం ప్రకటిస్తాను అని తేల్చింది. కనుక స్పీకర్ రాజీనామాలను ఆమోదిస్తే జగన్ విజయం సాధించినట్లే. ఏ విషయం అనేది మరో 5 రోజుల్లో తెలుస్తుంది. మరోపక్క వైఎస్ జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఇది మొదటి విజయం అని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. అంతేకాదు ఇక ప్రతి రోజు టీడీపీ పతనం ప్రారంభం కాబోతుందని గట్టిగా చెబుతున్నారు.