దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెండ్రోజుల పాటు బ్యాంకులు ముతపడనున్నాయి.వేతనాలు పెంపుపై నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు. అయితే ఈ సమ్మెలో 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొననున్నారు.బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుపై చర్చించేందుకు ఇప్పటికే అడిషనల్ చీఫ్ లేబర్ కమిషనర్(సీఎల్‌సీ)రాజన్ వర్మ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఆర్థిక శాఖ అధికారులు, బ్యాంకుల యాజమాన్యాలు భేటీ అయ్యారు. కానీ, చర్చలు ఫలించలేదు. దీంతో సమ్మె జరుగుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్. వెంకటాచలం తెలిపారు. దీనికి నిరసనగా మే 30, 31వ తేదీల్లో జరిగే సమ్మెలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పాల్గొననున్నట్లు అంచనా
