Home / ANDHRAPRADESH / టీడీపీకి షాక్..మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమ..ఇక కటకటాల వెనక్కే

టీడీపీకి షాక్..మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమ..ఇక కటకటాల వెనక్కే

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్‌మెంట్‌ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్‌ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్‌ కలెక్టర్‌నకు ఫిర్యాదు చేశారు.

see also..

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న మాజీ మంత్రి కొణతాల లేఖ ..!

ఈ ఘటనలు మరువకముందే.. తాజాగా మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక సబ్బరాయనగర్‌ వెంచర్‌లో స్థలం ఇస్తామని రూ. 35 లక్షలు వసూలు చేసినట్టు నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో తనతో మాట్లాడి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తనతో చెప్పారని బాధితులు చెబుతున్నారు. కానీ ఇపుడు స్థలం లేదు, సొమ్ము లేదంటూ మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేతో సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు.కనుక ఈ సారే ఎమ్మెల్యే బోండా కటకటాల వెనక్కే అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.

see also..అతి త్వరలో వైసీపీలోకి టాలీవుడ్ నటులు, నటీమణులు వీరే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat