బాహుబలి చిత్రంతో రాజమళి ప్రతిభ ఖండాంతరాలను దాటి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో ఫ్యామిలీ.. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంటుందన్న విషయం సినీ జనాలకు విధితమే. అందులోను రాజమౌళి భార్య రమదే కీలక పాత్ర అని చెప్పుకోక తప్పదు. రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో కాస్టూమ్ డిజైనర్‌గా రమదే కీలక బాధ్యతలు. మగధీ, బాహుబలి చిత్రాలకు రమనే కాస్టూమ్ డిజైనర్‌గా వ్యవరించింది.
ఇదిలా ఉండగా. రమ, రాజమౌళిల వివాహంపై సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అయింది. వారిద్దరి పెళ్లి చాలా ఆసక్తికరంగా జరిగిందట. ఈ విషయాన్నే రాజమౌళి ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసలు విషయానికొస్తే రాజమౌళికంటే.. రమ నాలుగేళ్ల పెద్దదట. అంతేకాకుండా, రాజమౌళి కొడుకుగా చెప్పుకునే కార్తికేయ కూడా రమ మొదటి భర్తకు పుట్టినవాడేనట. అలాగే, రాజమౌళి కూతురుగా చెప్పుకునే అమ్మాయి కూడా దత్తతకు తీసుకున్న తీసుకున్నామంటూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చారు.