యువహీరో రాజ్ తరుణ్ హీరోగా అమైరా దస్తూర్ హిరోయిన్ గా నటిస్తున్న చిత్రం ” రాజుగాడు “. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది.వచ్చే నెల ఒకటోతారీఖు విడుదల కాబోతున్నది.ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. మూవీ కి యు/ఎ సర్టిఫికెట్ లభించింది.
రాజ్ తరుణ్ తో ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి మంచి విజయవంతమైన చిత్రాలనందించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం కావడంతో “రాజు గాడు” పై భారీ ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంతో కొట్టగా సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ తో ఫామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందించారు.పాటలు రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల,కొరియోగ్రఫీ రఘు-విజయ్..