జులై చివరి వారం నాటికీ పంచాయితీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పంచాయతీ ఎన్నికలపైఈ రోజు ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీ రాజ్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్కె జోషి,తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు పక్క ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు . ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేశామని చెప్పారు.
పంచాయతీ ఎన్నికలు 1.5 కోట్ల ఓటర్లు పాల్గొంటారని… జూన్ 15 నాటికి ముద్రణా సామగ్రి సిద్ధమవుతుందన్నారు.బిసీ ఓటర్ల గణన జూన్ 1 లోగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల తర్వాత పంచాయతీ కార్యదర్శుల బదిలీలు ఉంటాయని ఆయన తెలిపారు.