ఏపీలో టీడీపీ నేతలు మధ్య సఖ్యత లేదు అనడానికి కారణం ఈ వార్తనే . విశాఖపట్నం జిల్లాలో ఇంతకముందు ఎన్నో సార్లు వీరి్దరి మధ్య స్నేహ భావం లేదని మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాను జిల్లా నుంచి బయటకు పంపించిన పశు సంవర్ధకశాఖ జేడీ కోటేశ్వరరావు, ఈవో సూర్య ప్రకాష్‌లను తిరిగి విశాఖలోనే నియమించారని అయ్యన్న పాత్రుడు అలిగినట్లు తెలుస్తోంది. మంత్రి గంటా జోక్యంతోనే వారికి తిరిగి విశాఖలో పోస్టింగ్ ఇచ్చారంటూ మంత్రి అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు నెలల కిందట డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కమిటీని తనకు తెలియకుండా గంటా అనుచరుడు వెంకటప్పడును నియమించుకొని తనను అవమాన పరిచారంటూ జేడీ, ఈవోలపై ఆయన మండిపడ్డ విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో మంత్రి అయ్యన్న పాత్రుడు అప్పుడే రాజీనామాకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
సవాల్ విసిరిన మంత్రి అయ్యన్న
తాను రాజీనామా చేయనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై మంత్రి అయ్యన్న పాత్రుడు స్పందించారు. కొంతమంది తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సోషల్ మీడియా వేదికగా లేనిపోని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పశుసంవర్ధక శాఖు సంబంధించిన విషయం ఎప్పుడో సమసిపోయిందన్నారు. కానీ కావాలనే కొంతమంది ఇలాంటి విషయాలను తెరపైకి తెస్తున్నారని, వారికి దమ్ముంటే తనను రాజకీయంగా ఎదుర్కోవాలంటూ సవాల్ విసిరారు. కాని ఈ సవాలు ప్రతి పక్షం వారి కాదు అధికారంలో ఉన్న టీడీపీ మంత్రి …మరో టీడీపీ మంత్రికి సవాలు విసిరాడని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.