ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లాన ప్రజలు పుష్పాలతో స్వాగతం పలుకుతున్నారు. అదే విధంగా వారి ప్రాంతంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. జగన్ వారి సమస్యలను వింటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ.. నేనున్నానంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కృష్ణా జిల్లాలో పూర్తి చేసిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ అడుగుపెట్టిన వేళ.. కృష్ణానది వారధి సైతం కదిలింది. ఆ సంఘటన ఏపీ రాజకీయాల్లో ఓ మరిచిపోలేని రోజుగా మిగిలిపోయింది. అయితే, కృష్ణా జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరులో పాదయాత్ర చేసిన జగన్.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు మారుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ నిర్ణయాన్ని అత్యధిక శాతం రాజకీయ నాయకులు స్వాగతించగా.. అధికార పార్టీ నేతలు మాత్రం జగన్‌పై విరుచుకుపడ్డారు. అయితే, జగన్ చేసిన ఆ ప్రకటనను స్వాగతించిన వారిలో ఇప్పుడు నందమూరి వారసులు కూడా చేరి పోయారు.
అయితే, మే 28న దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి రోజును పురస్కరించుకుని హైదరాబాద్ నగర పరిధిలోగల ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ వారసులు దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి హరికృష్ణ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని మీడియా సాక్షిగా డిమాండ్ చేశారు. ఇలా జగన్ తీసుకున్న నిర్ణయానికి ఎన్టీఆర్ వారసులు తమ మద్దతును తెలిపారు.