వినడానికి వింతగా ఉన్న ..ఇదే నిజం ..ఇది ఎక్కడో జరగలేదు సాక్షాత్తు ఆగ్రాలో చోటుచేసుకున్న సంఘటన .ఆగ్రాలో నాయికీ మండికీ కి చెందిన బన్సాల్ అనే వ్యక్తీ ఐఓబీ బ్యాంకు లో ఉన్న తన ఖాతాలో రెండు లక్షల రూపాయలను డిపాజిట్ చేయడానికి బయలుదేరాడు .
బ్యాంకు లోపలకి వెళ్తుండగా ఒక కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకి డబ్బుల సంచిని అందుకొని అక్కడ సమీపంలో ఉన్న భవనం మీదకు దూకబోతుండగా ఆ సంచి నుండి అరవై వేల రూపాయల నోట్ల కట్టలు జారిపడ్డాయి .మిగత ఒక లక్ష నలబై వేలున్న సంచిని కోతి ఎత్తుకెళ్ళింది .
దీంతో అవాక్కైన బన్సాల్ మిగిలినవారు కోతి వెంట పడిన కానీ లాభం లేకపోయింది .అయితే అనుకోకుండా జరిగిన సంఘటన మీద పోలీసులకు పిర్యాదు చేస్తే ఏమి చేయాలో అర్ధం కాక తలలు పట్టుకోవడం వారి వంతైంది.అంటే ఇక నుండి కేవలం దొంగల నుండి మాత్రమే కాకుండా ఏకంగా కోతుల నుండి తమ డబ్బులను జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నమాట ..