ఇటివల ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవీ చేపట్టిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరుగుతూ ఇజ్జత్తు తీశాడు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చిన రంగులను చూస్తే ఊసరవెల్లి కూడా ఆత్మహత్య చేసుకుంటుంది .
ప్రపంచ రాజధాని కడతాను అని ప్రపంచంలో ఉన్న పదహారు దేశాల్లో పర్యటించి ఆఖరికి సినిమాలల్లో సెట్టింగ్స్ లతో అందర్నీ ఆకట్టుకుంటున్న ఎస్ ఎస్ రాజ్ మౌళి ని కలిశారు .దీన్ని ఏమంటారు అంటే రాజులగా బ్రతికి ఇంటి వెనక చచ్చినట్లు ఉంది..జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి .లాయర్ దగ్గరకు కాదు అని ఆన్నారు .రాజధానికి రెండు వేల ఐదు వందల కోట్లు కేంద్రమిస్తే ఆ నిధులను ఎవరికీ పంచారో ..ఎవరు ఎంత తిన్నారో చెప్పమంటారా అని ఆయన బాబును ప్రశ్నిస్తారు ..