స్టార్ కమెడియన్‌గా టాప్ రేంజ్‌ను అనుభవిస్తున్న రోజుల్లోనే మర్యాద రామన్న చిత్రం ఇచ్చిన కిక్‌ను బేస్ చేసుకుని హీరోగా కంటిన్యూ అవుదామని నిర్ణయించుకున్నాడు నటుడు సునీల్. అయితే, నటుడు సునీల్ అలా అనుకున్నాడో లేదో హీరోగా చేసిన మొదటి రెండు మూడు సినిమాలు సక్సెస్ బాట పట్టినా.. ఆ తరువాత విడుదలైన చిత్రాలన్నీ బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలా వరుస ప్లాప్‌లలో ఉన్న సునీల్ తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి కమెడియన్ బాట పట్టేందుకు డిసైడయ్యాడు.
అయితే, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, హీరో రవితేజ కాంబోలో తాజాగా అమర్, అక్బర్, ఆంటోని చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కమెడియన్ పాత్రకు సునీల్ ఒప్పుకున్నాడని, అలాగే, సాయిపల్లవి, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రంలోనూ సునీల్ కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించబోతున్నాడని చిత్రపురి కాలనీ వాసులు చెబుతున్నారు. ఏదేమైనా నటుడు సునీల్ హీరో నుంచి మళ్లీ కమెడియన్ బాట పట్టడంతో ప్రస్తుతం వెండితెరపై కమెడియన్లుగా రాణిస్తున్న వారికి కాస్త ఇబ్బందికరంగా మారిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.