సోషల్ మీడియాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వాట్సాప్.. ఇప్పటికే తన వినియోగదారులకు పలు రకాల వినూత్న సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వాట్సాప్ తన వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజుల క్రితం వాట్సాప్ పేమెంట్స్ పేరుతో వాట్సాప్ ద్వారానే చెల్లింపులు, లావాదేవీలు చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.
అయితే ఆ సరికొత్త ఫీచర్ ను వచ్చే వారం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతో వాట్సాప్ ఒప్పందాలు కూడా చేసుకుంది.అయితే ఇటువంటి సేవలను పేటీఎం, ఫ్రీచార్జి వంటి సంస్థలు ఇప్పటికే అందిస్తున్నాయి. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా అటువంటి సంస్థలకు భారీ ఎదురుదెబ్బ తగలే అవకాశం ఉంది. ముఖ్యంగా పేటీఎంకు వాట్సాప్ గట్టి పోటీ ఇవ్వనుంది అని సమాచారం .